నాగార్జున సినిమాతో శ్రీకాంత్ కుమారుడి ఎంట్రీ!

2
కెరీర్ మొదట్లో విలన్ తరహా పాత్రలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. తెలుగు సినీ పరిశ్రమలో ఓ మంచి స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ హీరో కుమారుడు రోషన్ కూడా తండ్రి బాటలోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. కింగ్ నాగార్జున తన సొంత బ్యానర్‌పై రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘నిర్మలా కాన్వెంట్’ అనే ఓ ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోందని నాగార్జున తెలిపారు.

ఇక ఈ సినిమా విశేషాలు తెలియజేస్తూ.. ఒక ప్యూర్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండనుందని, ప్రస్తుతం ఈ సినిమా ప్రోగ్రెస్‌లో ఉందని నాగార్జున ఈ సందర్భంగా తెలిపారు. ట్విట్టర్ ద్వారా తన కొత్త ప్రొడక్షన్ ‘నిర్మలా కాన్వెంట్’ వివరాలు తెలిపిన నాగార్జున, ఈ సినిమాకు సంబంధించి రోషన్ ఫోటోలు కొన్నింటిని విడుదల చేశారు. ఈ సినిమాలో రోషన్ ఓ టీనేజ్ బాయ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version