మరొక యంగ్ హీరోతో నాగార్జున మల్టీ స్టారర్ ?

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ప్రయోగాత్మకమైన, మల్టీ స్టారర్ చిత్రాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో కార్తితో కలిసి ‘ఊపిరి’ సినిమా చేసిన ఆయన త్వరలో నానితో ఒక మల్టీ స్టారర్ చేయనున్నారు. అది కాకుండా ఇప్పుడు మరొక తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఆయన సినిమా చేయనున్నారనే వార్తలు వినవస్తున్నాయి.

ఈమధ్యే ధనుష్, నాగార్జున ఇద్దరూ కలిసి సినిమా విషయమైన మాట్లాడుకున్నారని, ఇంకా ప్రాజెక్ట్ ఆరంభ దశలోనే ఉందని అంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో, ఒకవేళ నిజమైతే ప్రాజెక్ట్ ఎప్పుడు, ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున ఆర్జీవీతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.