నాగ్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న ‘అనుభవించు రాజా’ ట్రైలర్..!

Published on Nov 16, 2021 9:16 pm IST


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ముహుర్తాన్ని ఖరారు చేసింది.

నవంబర్ 17 అనగా రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఆడుకలం నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి క్రిష్ణ, భూపాల్ రాజు, అరియాన కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More