ఎన్కౌంటర్ స్పెసలిస్ట్ గా అక్కినేని హీరో !
Published on Dec 5, 2017 11:29 am IST

అక్కినేని నాగార్జున, డైరెక్టర్ వర్మ కాంబినేషన్లో కొత్త మూవీ ఈ మధ్యే ప్రారంభమైన సంగతి తెలిసిందే. 1989 లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రేజీ కాంబినేషన్లో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మైరా సరీన్ అనే కొత్త హీరోయిన్ నాగార్జున సరసన నటించబోతోంది.

తాజా సమాచరం మేరకు ఈ సినిమా కోసం ‘గన్, సిస్టమ్’ అనే రెండు భిన్నమైన టైటిల్స్ వర్మ రిజిష్టర్ చేసారని తెలుస్తోంది. వీటిలో ఏదో ఒకదాన్ని త్వరలోనే ఫైనల్ చేయనున్నారు. ఇందులో నాగార్జునను ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గాను, హీరోయిన్ మైరా సరిన్ ను రఫ్ లుక్ లో చూపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో హిట్ అంటూ అందుకొని వర్మ ఈ సినిమాతో ఖచ్చితమైన హిట్ అందుకుని తనలోని సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నారు.

 
Like us on Facebook