‘బంగార్రాజు’ కథ పై మరో క్రేజీ రూమర్ !

Published on Nov 1, 2021 8:00 am IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఉన్నాయి. చైతు – నాగ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని నాగార్జున కనిపిస్తాడట. అంటే ఈ సినిమా మొత్తం ‘బంగార్రాజు’ అతని మనవడు నాగ్ పాత్ర చుట్టూ తిరుగుతుందట.

అంటే ‘బంగార్రాజు’ పాత్ర – ‘బంగార్రాజు’ మనవడి పాత్ర కలయికలో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయట. మొత్తానికి తాత మనవళ్లుగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.

కానీ లేట్ గా మొదలైన మంచి కంటెంట్ తో వస్తున్నారు. వచ్చే సమ్మర్ కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More