ఈ నెలలోనే నాగార్జున ‘రాజుగారి గది -2’ ట్రైలర్ !
Published on Sep 18, 2017 9:28 am IST


సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఎన్నడూ ట్రై చేయని హర్రర్ కామెడీ జానర్లో చేస్తున్న చిత్రం ‘రాజుగారి గది -2’. కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా మిగతా కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతుండగా దాన్ని రెట్టింపు చేయడానికి చిత్ర ట్రైలర్ ను అక్కినెయ్ నాగేశ్వరరావు పుట్టినరోజు పుట్టినరోజైన సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున మానసిక వైద్యుడిగా కనిపించనుండగా ఆయనకు కాబోయే కోడలు సమంత ఒక ఆత్మ పాత్రలో మెప్పించనున్నారు. ఇందులో నాగార్జునకు జోడీగా శీరత్ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రం ‘రాజుగారి గది’ కి సీక్వెల్ కాదని, కథ, కథనం, పాత్రలు అన్నీ కొత్తగా ఉంటాయని నాగార్జున గతంలోనే తెలిపారు. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ డైరెక్ట్ చేస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook