విడుదలకు సిద్ధంగా ఉన్న నాగార్జున చిత్రం !


సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఎన్నడూ ట్రై చేయని హర్రర్ కామెడీ జానర్లో చేస్తున్న చిత్రం ‘రాజుగారి గది -2’. అక్టోబర్ 13న విడుదలకానున్న ఈ సినిమా పనులు దాదాపుగా పూర్తైపోయినట్టు నాగార్జున తెలిపారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోందని, తన వంతు డబ్బింగ్ కూడా అయిపోయిందని చెప్పిన నాగ్ కేవలం వెన్నెల కిశోర్ మీద ఒక్క రోజు షూట్ జరగాల్సి ఉందని, వచ్చే నెల 10 కల్లా ఫస్ట్ కాపీ వచ్చేస్తుందని అన్నారు.

అలాగే ఈ సినిమా ‘రాజుగారి గది’ కి సీక్వెల్ కాదని, కేవలం టైటిల్ బాగుంటుందని తీసుకోవడం జరిగిందని, కానీ కథ మొత్తం వేరుగానే ఉంటుందని, ఇందులో తనది మెంటలిస్ట్ పాత్రని, అలాగే సమంత ఒక ఆత్మగా నటిస్తోందని, తనకి, ఆమెకు మధ్యనే ఎక్కువ డ్రామా ఉంటుందని అన్నారు. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ డైరెక్ట్ చేస్తున్నారు.