మరింత పవర్ ఫుల్ గా “ది ఘోస్ట్” రిలీజ్ ట్రైలర్!

Published on Sep 30, 2022 4:16 pm IST

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రా ఏజెంట్ గా ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. మరింత ఏమోషనల్ గా, యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డబ్బు, సక్సెస్ సంతోషం కంటే, శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది అని నాగ్ చెప్పిన డైలాగ్ సినిమా లో ఇన్ డెప్త్ కంటెంట్ ను సూచిస్తోంది.

ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకుంది. ప్రతి సీన్ తో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు మరియు ప్రేక్షకుల కి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను హామీ ఇస్తోంది. సోనాల్ చౌహాన్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కే. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, భరత్ సౌరభ్ లు సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :