శరవేగంగా నాగార్జున “ది ఘోస్ట్” షూటింగ్… ఇంట్రెస్టింగ్ ఫోటో రిలీజ్

Published on Apr 8, 2022 3:00 pm IST


కింగ్ అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో కలిసి హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ది ఘోస్ట్ కోసం జతకట్టారు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. నిర్మాతలు ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసారు. ఇప్పుడు ఊటీలో తాజా షెడ్యూల్‌ను మొదలు పెట్టడం జరిగింది. అదే విషయాన్ని ప్రకటించేందుకు దర్శకుడు సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది.

ఈ ఫోటో మంచి వ్యూ తో ఆసక్తికరం గా ఉంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. గుల్ పనాగ్ మరియు అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :