మే 20న రాబోతున్న “కృష్ణ వ్రింద విహారి”!

Published on Apr 18, 2022 11:24 am IST


టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని చేస్తున్న సినిమా “కృష్ణ వ్రింద విహారి”. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మే 20న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి.

ఎలాగూ టీజ‌ర్ ఆధ్యాంతం ఆక‌ట్టుకుంటుంది కాబట్టి.. సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. యువ సంగీత దర్శకుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకు జోడిగా షిర్లే సేటియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మరి ఈ సినిమాతో ‘నాగశౌర్య’ ఏ రేంజ్ హిట్ కొడతాడు అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :