“ఆదికేశవ” విషయంలో నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 21, 2023 9:00 am IST

మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లోనే ఓ సెన్సేషన్ డెబ్యూ తో ఇండస్ట్రీకి పరిచయం కాగా ఇప్పుడు తన లేటెస్ట్ చిత్రం “ఆదికేశవ” రిలీజ్ తో అయితే సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం ఒక మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టుగా నిన్న ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా విషయంలో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ అయితే వైరల్ గా మారాయి.

ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి లాంటి మాస్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది అని ఆ చిత్రాలు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మాస్ సినిమా ఇంకా రాలేదు ఆ ప్లేస్ ని “ఆదికేశవ” భర్తీ చేస్తుంది అన్నట్టుగా తెలిపారు. అయితే రీసెంట్ గా వచ్చిన బాలయ్య భగవంత్ కేసరి కోసం కూడా మాట్లాడుతూ అందులో బాలయ్య గారు వేరే పాయింట్ టచ్ చేశారు కానీ ప్రాపర్ గా ఓ మాస్ సినిమాగా అయితే ఆదికేశవ నిలుస్తుంది అని కామెంట్స్ చేశారు. దీనితో ఈ సినిమా విషయంలో కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :