‘నాపేరు సూర్య’ బన్నీ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది – నాగబాబు


అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. దేశభక్తి నైపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగబాబు సమర్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘కథను విన్నాను. బన్నీకి జన్యూన్ గా ఓక్ మంచి సినిమా అవుతుంది. అంటే బన్నీ కెరీర్లో ఉత్తమమైన మొదటి మూడు సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది’ అన్నారు.

అంతేగాక ఇది మంచి విలువలున్న సినిమా అని, చాలా గ్యాప్ తర్వాత నేను కూడా మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని అనిపిస్తోంది అన్నారు. శిరీష్ , శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. దీని కోసం ఆయన యూఎస్ ట్రైనర్ల వద్ద శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.