
కింగ్ నాగార్జున – యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. ఇటీవలే దుబాయ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు. జూలై సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షెడ్యూల్ యూరప్ లో మొదలవుతుంది. ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు కంటిన్యూగా జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో లొకేషన్స్ ని ఫైనలిజ్ చేసారు. బెల్గ్రేడ్ లో షూటింగ్ జరుపుకోనున్న మొట్ట మొదటి సౌత్ ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం.
బెల్గ్రేడ్ లో షూటింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఈ చిత్ర టీం పారిస్, ఫ్రాన్స్ లోని ల్యాన్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు. ఈ 30 రోజుల షెడ్యూల్ లో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేయనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో నాగార్జున, కార్తీ, తమన్నా లు పాల్గొననున్నారు. వంశీ పైడిపల్లి మునుపెన్నడూ లేని రీతిలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసారు. ముఖ్యంగా పారిస్ లో షూట్ చేయాలనుకున్న కార్ ఎపిసోడ్ టాలీవుడ్ కి ఓ సరికొత్త యాక్షన్ ఎపిసోడ్ ని పరిచయం చేస్తుందని అంటున్నారు. ఈ యూరప్ షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుంది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.