రవితేజతో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ ?

Published on Dec 20, 2021 12:00 am IST

మాస్ మహా రాజా రవితేజ – నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో అనసూయ నటిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోందని టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ రవితేజతో కలిసి ఒక సినిమాలో నటించింది.

మరి ఈ సినిమాలో కూడా నటిస్తోందేమో చూడాలి. కాగా ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట. ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ ఎట్టకేలకు స్టార్ట్ అయింది.

ఇక గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. రవితేజ ఖిలాడి సినిమా రిలీజ్ రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :