‘ధమాకా’లో రాజ్ తరుణే నటిస్తున్నాడట?

‘ధమాకా’లో రాజ్ తరుణే నటిస్తున్నాడట?

Published on Feb 21, 2022 1:35 PM IST


మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. ఈ క్రమంలో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధమాకా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు అని అన్నారు.

కాగా తాజాగా ఈ పాత్రలో రాజ్ తరుణే కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతానికి అయితే రాజ్ తరుణ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తే కెరీర్ కి ప్లస్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రవితేజ కొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. కాకపోతే రవితేజ ఖిలాడి సినిమాతో మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు