మాస్ మహా రాజా రవితేజ – నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ చేబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని రవితేజ పాత్ర చాల కొత్తగా ఉంటుందని, కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది.
అయితే రమేష్ వర్మ ఖిలాడీ సినిమా చేస్తున్న క్రమంలో రవితేజ, నక్కిన సినిమా మరింత ఆలస్యం అయింది. కానీ వచ్చే నెలలో ఖిలాడి పూర్తి కానుంది. కాబట్టి, నక్కిన – రవితేజ సినిమా జులై లాస్ట్ వీక్ నుండి మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట.
అన్నట్టు రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు.
