నష్టాలతో ముగిసిన ‘నక్షత్రం’ !


ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ చేసిన చిత్రం ‘నక్షత్రం’. పోలీసుల జీవితాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనైనా హిట్ అందుకొని ట్రాక్లో పడాలని ఆశించారు. కానీ సినిమా ఫలితం మాత్రం తారుమారైంది. సందీప్ కిషన్, రెజినా, ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ వంటి లైమ్ లైట్లో ఉన్న హీరో హీరోయిన్లు నటించినా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిందీ చిత్రం.

విడుదలకు ముందు మంచి క్రేజ్ తోనే ఉన్నప్పటియికీ సినిమాలో కొత్తదనం లేకపోవడంతో కృష్ణ వంశీకి మరోసారి నిరాశ తప్పలేదు. ఇక కలెక్షన్ల విషయానికొస్త అవి కూడా నిరుత్సాహకారంగానే ఉన్నాయి.

ఏరియా కలెక్షన్స్
ఏపి, నైజాం 3. 93 కోట్లు
కర్ణాటక 15 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా 5 లక్షలు
ఓవర్సీస్ 3 లక్షలు
మొత్తం 4.16 కోట్లు