వైరల్ : సూపర్ స్టార్ పై నమ్రత ఆసక్తికర పోస్ట్.!

వైరల్ : సూపర్ స్టార్ పై నమ్రత ఆసక్తికర పోస్ట్.!

Published on Nov 27, 2022 2:00 PM IST

గత కొన్ని రోజులు కితమే మన తెలుగు సినిమా దగ్గర బిగ్ స్టార్ అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు కన్ను మూసిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన మహా అధ్యాయం టాలీవుడ్ లో ముగియగా ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం కలిగింది. అయితే వారి కుటుంబం అంతా కూడా ఈ చేదు వార్తని స్వీకరించి ముందుకు సాగుతున్నారు.

అయితే గత కొన్ని రోజులు కితమే మహేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టగా ఇప్పుడు మహేష్ భార్య కృష్ణ గారి కోడలు అయినటువంటి నమ్రత ఘట్టమనేని ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టి కృష్ణ గారికి నివాళులు అర్పించింది. సినీ ప్రస్థానంలో ఎన్నో ఫస్ట్ లు పరిచయం చేసిన మాకు ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసారు.

మీ లెగసిని మేము ముందుకు తీసుకెళ్తాము ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాము మావయ్య గారు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మరి దీనిలో ఉన్న వీడియోలో కూడా సూపర్ స్టార్ చేసిన ఎన్నో ఐకానిక్ పాత్రలు, సినిమాలో తాను పరిచయం చేసిన టెక్నాలజీల కోసం గొప్పగా చెబుతూ అద్భుతమైన నివాళి అందించారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు