ఫాదర్స్ డే: మహేష్ బాబు గురించి ప్రత్యేక పోస్ట్‌ చేసిన నమ్రత

Published on Jun 19, 2022 4:01 pm IST

ఈరోజు ఫాదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ తొలి హీరో పట్ల తమ ప్రేమను, ప్రత్యేక శుభాకాంక్షలు, ఆశ్చర్యకరమైన బహుమతులతో తెలియజేస్తున్నారు. సెలబ్రిటీలు దీనికి మినహాయింపు కాదు. మహేష్ బాబు శుభాకాంక్షల తర్వాత, అతని భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు పై ప్రత్యేక పోస్ట్ ను చేయడం జరిగింది.

ఆమె తన ప్రియతమ భర్తతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ, “నా మనసున్న మనిషికి మరియు మా పిల్లల తండ్రికి, హ్యాపీ ఫాదర్స్ డే మహేష్ బాబు. ఈ జీవితాన్ని మీతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు” అని రాసింది. ఈ శుభాకాంక్షలు మరియు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాక నెటిజన్స్ ఈ పోస్ట్ కి భారీగా లైక్స్ మరియు షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :