లేటెస్ట్ : భర్త మహేష్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన నమ్రత శిరోద్కర్

లేటెస్ట్ : భర్త మహేష్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన నమ్రత శిరోద్కర్

Published on Dec 17, 2022 3:00 AM IST

టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు, దివంగత దిగ్గజ నటులు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడిగా చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అనంతరం రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక కెరీర్ పరంగా ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి బాటలో అనేక సామజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.

ఇక 2005లో నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ బాబు, ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ కి ప్రాధాన్యతనిస్తుంటారు. ఇక లేటెస్ట్ గా ఆయన సతీమణి నమ్రత ఒకానొక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూ ప్రోమోలో భాగంగా భర్త సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. మొదటి నుండి తనకు ఒక మంచి ఫ్రెండ్ మాదిరిగా ఎన్నో విషయాల్లో మహేష్ తోడు నీడగా నిలిచారని, ఆయన భర్తగా లైఫ్ లో దొరకడం తన అదృష్టం అని, ముఖ్యంగా తన తల్లితండ్రుల మరణ సమయంలో భర్తగా, స్నేహితుడిగా అయన ఎంతో గొప్ప మానసిక స్థైర్యాన్ని అందించారని అన్నారు.

అలానే మీ మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తవా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు, తమ ఇంట్లో ఎటువంటి వివాదాలు రావని, అయితే పిల్లల విషయంలో మాత్రం కొద్దిపాటి చిన్న వివాదం జరుగుతుంటుందని సితార, గౌతమ్ ఇద్దరినీ తాను స్ట్రిక్ట్ గా ఉంచితే మహేష్ మాత్రం వారిని ఒకింత ముద్దు చేస్తారని సరదాగా వెల్లడించారు. కాగా నమ్రత గారి ఫుల్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ అతి త్వరలో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు