సంగీత ప్రపంచానికే తీరని లోటు…లతా మంగేష్కర్ మృతి పై నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి!

సంగీత ప్రపంచానికే తీరని లోటు…లతా మంగేష్కర్ మృతి పై నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి!

Published on Feb 6, 2022 1:40 PM IST

ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపూర్ శాసన సభ సభ్యుడు నందమూరి బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అంటూ చెప్పుకొచ్చారు. ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరని లోటు అని అన్నారు. ఈ మేరకు లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ లతా మంగేష్కర్, 7 దశాబ్దాల్లో 30 కి పైగా 30 వేల పాటలు పాడటం లతా మంగేష్కర్ గాన మాధుర్యానికి నిదర్శనం అని అన్నారు. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు, ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు, భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, అవార్డు లే కాదు, విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలు అందించి ఆమెను గౌరవించాయి అని అన్నారు.

అయితే లతా మంగేష్కర్ మృతి మన దేశానికీ కాదు, సంగీత ప్రపంచానికే తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రెస్ నోట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు