సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫ్యామిలీ పిక్!

Published on May 22, 2022 6:30 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ ఫ్యామిలీ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ ఫ్యామిలీ ఫోటో లో నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర దేవి, మోక్షజ్ఞ, బ్రాహ్మణి లతో ఉన్నారు. ఈ లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటో ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాలయ్య ఈ ఫొటోలో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

సినిమాల విషయం కి వస్టే నందమూరి బాలకృష్ణ అఖండ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే జోరు తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :