నటసింహ నందమూరి బాలకృష్ణ ఉగ్రనరసింహంగా మళ్లీ అవతారం ఎత్తనున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తోన్న 105వ చిత్రంలో బాలయ్య అలా కనిపించనున్నారు. కాగా కత్తి పట్టి శత్రువుల తలలు నరిగే సన్నివేశానిలోని బాలయ్య గెటప్ ను రివీల్ చేస్తూ చిత్రబృందం దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.
`జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం తరువాత షెడ్యూల్ ను అక్టోబర్ 12వ తేదీ నుండి హైదరాబాద్ లో ప్రారంభమవ్వనుందని తెలుస్తోంది. కాగా ఇటీవల విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. మరి ఈ రోజు విడుదల అయిన పోస్టర్ కి ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి.
మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
