ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘అన్విత గ్రూప్’ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ నియమితులయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ సీఎండీ అచ్యుతరావు బొప్పన ఈ విషయాన్ని ప్రకటించి, బ్రాండ్ ఫిల్మ్స్‌ను ఆవిష్కరించారు. మాట తప్పని బాలకృష్ణ వ్యక్తిత్వం, తమ సంస్థ పాటించే విలువలకి అద్దం పడుతుందని, ‘బిల్డ్ హ్యాపినెస్’ అనే తమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయనే సరైన వ్యక్తి అని అచ్యుతరావు పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా దుబాయ్, అబూదాబిలలో 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తి చేసిన అన్విత గ్రూప్, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌తో పాటు హైదరాబాద్‌లోనూ భారీ ప్రాజెక్టులు చేపట్టింది. హైదరాబాద్‌లోని మూడు ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా కొల్లూరులోని ‘అన్విత ఇవానా’ ప్రాజెక్ట్‌కు గడువు కంటే ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లభించడం విశేషం.
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నగరంలోనే అత్యంత ఎత్తైన భవనాలతో పాటు, విశాఖపట్నంలోనూ ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు సీఎండీ వెల్లడించారు. వచ్చే 5–6 ఏళ్లలో ప్రతి ఏడాది సుమారు 1000 యూనిట్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
