ఆహా “తెలుగు ఇండియన్ ఐడల్” సెమీ ఫైనల్ కి స్పెషల్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ!

Published on May 29, 2022 9:40 pm IST

తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వచ్చిన ఆహా వీడియో ఎంటర్ టైన్మెంట్ రంగం లో దూసుకు పోతుంది. కొత్త సినిమాలతో పాటుగా, కొత్త వెబ్ సిరీస్ లను అందిస్తున్న ఈ ఆహా వీడియో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైన సింగర్ లకి అవకాశం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ కార్యక్రమం కి టాలీవుడ్ నటి నిత్యా మీనన్, సంగీత దర్శకులు థమన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ రామ చంద్ర ఈ కార్యక్రమం కి హోస్ట్ గా నిర్వహిస్తున్నారు.

అయితే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్ కి స్పెషల్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఒక చిత్రం చేస్తున్నారు. అంతేకాక మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మాస్ ఎంటర్ టైనర్ కి సిద్ధం అవుతోన్నారు. అఖండ చిత్రం విజయం తో బాలయ్య దూసుకు పోతున్నారు.

సంబంధిత సమాచారం :