టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్’ పురస్కారం నందమూరి బాలకృష్ణను వరించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో భాగంగా నందమూరి బాలకృష్ణ సినిమా రంగానికి చేసిన కృషిని గుర్తిస్తూ.. కళల విభాగంలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. బాలకృష్ణ ఈ ప్రెస్టీజియస్ పురస్కారం ప్రకటనతో నందమూరి అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
దేశంలోనే మూడో అతిపెద్ద పురస్కారం పద్మభూషణ్. మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా.. వారిలో 113 మందికి పద్మశ్రీ, 19 మందికి పద్మభూషణ్, 7 మందికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.