ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ

Published on May 16, 2022 1:48 pm IST

నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో విశిష్టమైన వ్యక్తులలో ఒకరు. ఆయన సేవకు, ప్రేమకు తెలుగువారు ఆయన్ను దేవుడిగా భావిస్తారు. సినీ రంగమైనా, రాజకీయ రంగమైనా నందమూరి తారక రామారావు తెలుగు నేలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి, కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ జయంతి, శతజయంతి వేడుకలు మే 28, 2022 న ప్రారంభం కానున్నాయనేది తాజా వార్త.

హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ గ్రాండ్ ఈవెంట్‌ని ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఉదయం ప్రారంభిస్తారు. అదేవిధంగా గుంటూరు, తెనాలిలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రతి తెలుగు ఇంటిలో జరిగే వేడుకగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

సంబంధిత సమాచారం :