తన మనవళ్ళతో నందమూరి బాలకృష్ణ…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on Jun 10, 2022 9:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు నందమూరి బాలకృష్ణ కి తన మనవళ్లు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో లో బాలకృష్ణ మరింత అందంగా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటో కి ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ, షేర్ చేస్తున్నారు.

బాలకృష్ణ సినిమాల పరంగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ హంట్ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంతుంది. అదే విధంగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో మాస్ ఎంటర్ టైనర్ చేయనున్నారు బాలకృష్ణ.

సంబంధిత సమాచారం :