భారత పారాలింపిక్స్ విజేతలకు బాలయ్య గౌరవ అభినందనలు!

Published on Sep 7, 2021 1:09 pm IST


ఈ ఏడాది ఎంతో ఘనంగా టోక్యో ఒలింపిక్స్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సాధారణ క్రీడలతో పాటుగా పారాలింపిక్స్ కూడా అక్కడ నిర్వహించగా భారత్ నుంచి వెళ్లిన క్రీడాకారులు ఎన్నో పథకాలను భారత గడ్డకు తీసుకొచ్చారు. మరి వారికి ఎందరో అభినందనలు తెలియజేస్తుండగా తాజాగా మన టాలీవుడ్ నుంచి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఆ విజేతలు అందరికీ ఎంతో మర్యాదపూర్వకంగా తన గౌరవ అభినందనలు తెలియజేసారు.

“టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో పతకాలను గెలవటమే కాకుండా కొత్త రికార్డ్స్ కుడా సృష్టించారు, మీరు కేవలం క్రీడాకారులే కాదు, అంగవైకల్యాన్ని శాపంగా భావించి బాధపడే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఆశాజ్యోతులు… ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను, మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని బాలయ్య చాలా వినమ్రంగా తెలియజేసి తన ఉదారతను చాటుకున్నారు.

మరి ప్రస్తుతం బాలయ్య తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ అనే సాలిడ్ మాస్ ఎంటెర్టైనర్ ని చేస్తుండగా దీని తర్వాత మరో స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా తియ్యనున్నారు. అంతే కాకుండా మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తో ప్రాజెక్ట్ రానున్న దసరాకి అనౌన్స్ కానుంది..

సంబంధిత సమాచారం :