షూటింగ్ సెట్లో గాయపడిన కళ్యాణ్ రామ్ !

8th, December 2017 - 02:00:05 PM

నందమయూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు జయేంద్ర డైరక్షన్లో రూపోయిందనున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితమే మొదలై శరవేగంగా ముందుకెళుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ వికారాబద్లో జరుగుతోంది. అక్కడే ఒక కీలకమైం సన్నివేశాన్ని చేస్తుండగా కళ్యాణ్ రామ్ ప్రమాదానికి గురయ్యారట.

ఈ ప్రమాదంలో ఆయన చేతికి గాయమైందని, అయినా కళ్యాణ్ రామ్ షూట్ ఆపలేదని, అత్యవసర చికిత్స అనంతరం కూడా షూట్లో పాల్గొన్నారని సమాచారం. తమన్నా కథానాయకిగా నటిస్తున్న ఈ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తుండగా కూల్ బ్రీజీ సినిమాస్ నిర్మిస్తోంది.