మహేష్ సినిమాలో తనపై వస్తున్న వార్తలపై స్పందించిన స్పందించిన తారక రత్న.!

Published on May 29, 2022 4:58 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ అనంతరం మహేష్ బాబు కుటుంబం తో వెకేషన్ కి వెళ్లగా నెక్స్ట్ జూలై నుంచే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. మరి దీనిపై ఆల్రెడి భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రంలో నందమూరి వారి హీరో నందమూరి తారక రత్న విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా కొన్ని రూమర్ లు బయటకి వచ్చాయి.

అయితే వాటికి అనుగుణంగానే నిన్న నందమూరి తారక రత్న పేరిట సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు దీనిపై తారక రత్న పి ఆర్ టీం ఒక అధికారిక క్లారిటీ ఇచ్చారు. తారక రత్న పై వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదని తనకి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్ లేదని ఏదైనా సమాచారం ఉంటే తన పి ఆర్ టీం చెబుతారని అందరూ ఈ విషయాన్ని గమనించాలి అని సూచించారు. దీనితో ప్రస్తుతానికి మాత్రం మహేష్ సినిమాలో తారక రత్న లేడనే కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :