మెగా హీరో సినిమాలో కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ !

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తాజాగా నటిస్తోన్న సినిమాకు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. కామిడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు సంభందించిన ఒక వార్తా బయటికి వచ్చింది.

ఈ నెల 10 న పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదల కాబోతోంది. జనవరి 9న యు ఎస్ లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. తాజా సమాచారం ఏంటంటే.. అజ్ఞాతవాసి సినిమా విరామ సమయంలో కళ్యాణ్ రామ్ ఎంఎల్ఎ ట్రైలర్ ప్లే చేయ్యబోతున్నరంట. మని శర్మ సంగీతం అందించిన ఎంఎల్ఎ సినిమాకు ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.