తన ఖర్చులు తానే భరిస్తానన్న నందమూరి హీరో !


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన మంచి మనసును చాటుకున్నారు. ఈ మే నెల 28న అమెరికాలో జరగనున్న తానా సభలకు అక్కడి నిర్వాహకులు కళ్యాణ్ రామ్ ను కూడా ఆహ్వానించారు. అక్కడ స్థానికంగా తానా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ ను కూడా కళ్యాణ్ రామ్ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ తో పాటు ఇంకొందరు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు.

సాధారణంగా ఇలాంటి వేడుకలకు ఆహ్వానిస్తే నిర్వాహకులే సెలబ్రిటీల ప్రయాణ, బస ఖర్చులను భరిస్తారు. ఆ మొత్తం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ తానా సభ్యులు కూడా కళ్యాణ్ రామ్ కు తన ఖర్చులన్నీ భరిస్తామని చెప్పగా కళ్యాణ్ రామ్ మాత్రం వాళ్ళ ఆఫర్ ను తిరస్కరించారట. ఖర్చులన్నీ తానే పెటుకుంటానని చెప్పారట. అంతేగా తనకు కేటాయించిన ఖర్చులను అక్కడ స్థానికంగా చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం వినియోగించమని కూడా చెప్పారట.