బింబిసార-2 అప్డేట్.. ప్రీక్వెల్ ను అనౌన్స్ చేసిన క‌ళ్యాణ్ రామ్!

బింబిసార-2 అప్డేట్.. ప్రీక్వెల్ ను అనౌన్స్ చేసిన క‌ళ్యాణ్ రామ్!

Published on Jul 5, 2024 12:26 PM IST


నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన సోషియో ఫాంట‌సీ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంద‌ని మేక‌ర్స్ గ‌తంలో వెల్ల‌డించారు. అయితే, తాజాగా దీనికి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేక‌ర్స్.

త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే కొన్నేళ్ల‌ ముందు ప‌రిపాలించిన చ‌క్ర‌వ‌ర్తి ఇతివృత్తంతో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాను తెర‌క‌క్కించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని NKR22 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందించ‌నున్నారు. ఇక ఈ సినిమా బింబిసార చిత్రానికి ప్రీక్వెల్ గా వ‌స్తున్న‌ట్లు మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

అయితే, ఈ సినిమాను అనిల్ పాడూరి అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. ఓ సాలిడ్ పోస్ట‌ర్ తో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వ‌ర‌లోనే ఇవ్వ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు