కళ్యాణ్ రామ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ !

కళ్యాణ్ రామ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Nov 7, 2022 11:00 AM IST

బింబిసార అంటూ వైవిధ్యమైన సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిగోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకేలా కనిపించే వ్యక్తి(ల)ని కలవడం వల్ల కలిగే పరిణామాలపై ఈ చిత్రం ఉండబోతుంది.

మొత్తానికి పోస్టర్ లో కళ్యాణ్ రామ్ లుక్ క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కన్నడ నటి ఆషిక రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. పైగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు