డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించిన బింబిసార !

Published on Aug 8, 2022 11:04 am IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 3 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 15.90 కోట్ల భారీ షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా థియేటర్ రైట్స్ ను 13 కోట్లకు కొనుగోలు చేయడంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లందరూ పూర్తి లాభాల్లోకి వెళ్లిపోయారు.

మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే బింబిసార లోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఒకపక్క ‘సీతా రామం’ నుంచి గట్టి పోటీ ఉన్నా.. ‘బింబిసార’ భారీ కలెక్షన్స్ ను రాబడుతుండటం విశేషం.

సంబంధిత సమాచారం :