“అఖండ” విజయంపై నందమూరి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు.!

“అఖండ” విజయంపై నందమూరి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు.!

Published on Jan 20, 2022 9:02 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ” అందుకున్న విజయం తాలూకా రీసౌండ్ ఈరోజుకి కూడా వినిపిస్తుంది. ఇక ఈరోజు తో అయితే ఈ సినిమా 50 రోజులు వేడుకలు ఏకంగా 100 కి పైగా థియేటర్స్ లో జరుపుకుంటుంది. దీనితో నందమూరి అభిమానులు చాలా కాలం తర్వాత ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా విడుదల అయ్యిన రోజు నుంచి దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకుల కోసం అటెంప్ట్ చేసిన బాలయ్య గట్స్ కి యూనానిమస్ స్పందన కూడా వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చూపించిన భారతదేశ సనాతన ధర్మం దేవాలయాల అభ్యున్నతి ఎంతో ఆకట్టుకున్నాయి.

మరి ఇలా 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమాపై స్వర్గీయ నందమూరి తారక రామారావు మరో తనయుడు బాలకృష్ణ సోదరుడు నందమూరి రామ కృష్ణ కొన్ని కీలక కామెంట్స్ చేశారు.

“సనాతన ధర్మం పరిరక్షణ గురించి చాటిచెప్పిన శివ సైనిక, మన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అఖండ ప్రేక్షకాధరణతో అఖండ విజయంతముగా 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి గర్జించి దూసుకొని వెళ్తున్న శుభవేళ్ళల్లో మన నందమూరి బాలకృష్ణ నందమూరి వీరాభిమానులందరికి ప్రేక్షక దేవుళ్ళకు ఈ అఖండ చిత్రాన్ని అఖండ విజయవంతముగా చేసినందుకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నానని” నందమూరి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు