ఏపీ ప్రభుత్వానికి నందమూరి రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞ్యతలు.!

ఏపీ ప్రభుత్వానికి నందమూరి రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞ్యతలు.!

Published on Jan 27, 2022 6:45 PM IST

తాజాగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రలో ఉన్న 13 జిల్లాలను మొత్తం 26 జిల్లాలుగా విభజిస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ప్రకటన అనంతరం ప్రాంతాల వారీగా ఏయే నూతన జిల్లాలు ఏర్పడ్డాయి? వాటికి ఏమన్నా కొత్త పేర్లు మార్పులు పెట్టారా? అనేవి కూడా వెల్లడించారు. అయితే ఈ పేర్లలో విజయవాడ కు గాను టాలీవుడ్ దిగ్గజ నటుడు సీనియర్ హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును పెట్టడం జరిగింది.

దీనితో ఈ నిర్ణయం పట్ల సినీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేసాయి. మరి ముఖ్యంగా అయితే నందమూరి అభిమానులు మరియు కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఈ నిర్ణయం పట్ల ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యడం జరిగింది.

“తెలుగు జాతిమనదీ నిండుగ వెలుగు జాతి మనది…ప్రాంతాలు వేరైనా మనమందరం తెలుగు బిడ్డలు ఒక్కటేనని చాటిచేప్పి… తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జీవింప చేసి ఎర్రకోటపై మన తెలుగు జాతి పతాకం ఎగరేసిన మన తెలుగు వెలుగు, యుగపురుషుడు కారణజన్ముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారి పేరిట “ఎన్.టి.ఆర్ జిల్లా”, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము తెలుగోడు గర్వపడే విధముగా తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదాయకం, స్వాగతిస్తున్నాము” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.

మరి గత కొన్ని రోజులు కితమే నందమూరి రామకృష్ణ నటసింహం నందమూరి బాలకృష్ణ అందుకున్న రీసెంట్ భారీ హిట్ “అఖండ” విజయం పై కూడా తన స్పందనను తెలియజేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు