నందమూరి తారకరత్న మృతి తో సినీ పరిశ్రమ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. తారకరత్న కి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు తండ్రి మోహనకృష్ణ. ఈ కార్యక్రమం లో బాలకృష్ణ, నందమూరి సోదరులు తారకరత్న పాడే మోశారు.
తారకరత్న వెంటే వైకుంఠ రథంలో బాలకృష్ణ, చంద్రబాబునాయుడు మహాప్రస్థానానికి విచ్చేశారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలకు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ లతో పాటుగా, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా హజరయ్యారు. తారకరత్న అంతిమయాత్రలో అభిమానూలు, తెదేపా కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.