‘బింబిసార’ లో మెయిన్ హైలైట్స్ అవే – కళ్యాణ్ రామ్

Published on Jul 29, 2022 3:00 am IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బింబిసార. కె హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ కథగా సాగె యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ పై అందరిలో అంచనాలు విపరీతంగా ఏర్పడ్డాయి. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిగర్తల రాజు బింబిసారుడిగా కనిపించనుండగా చిరంతన్ భట్ సంగీతాన్ని కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఇక ఈ మూవీ గురించి పలు హైలైట్ విషయాలు మీడియాతో మాట్లాడుతూ పంచుకున్నారు కళ్యాణ్ రామ్.

సినిమాకి ప్రధాన హైలైట్ దర్శకడు వశిష్ట అందించిన కథ అని, తాను ఎన్నో ఏళ్ల నుండి ఎటువంటి కథ కోసం అయితే ఎదురు చూస్తున్నానో, అటువంటి కథే వశిష్ట తనకు వినిపించాడని, అయితే అనంతరం తామిద్దరం కలిసి దాని పూర్తి స్క్రిప్ట్ విషయమై కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన చెప్పారు. అలానే ఆ కథని తెర మీద వశిష్ఠ చూపించిన తీరు మరింత బాగుందన్నారు. ఇక ఈ మూవీలో బింబిసారుడి పాత్ర, టైం ట్రావెల్ థీమ్ తో పాటు సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించిన ఫోటోగఫ్రర్ చోట కె నాయుడు, అలానే విఎఫ్ఎక్స్ డిపార్ట్ మెంట్ పని తీరు ఎంతో అద్భుతం అన్నారు. మరీ ముఖ్యంగా మూవీకి కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలుస్తుందని, ఇప్పటికే సాంగ్స్ కూడా ఆడియన్స్ ని అలరించడంతో ఆగష్టు 5న రిలీజ్ కానున్న మూవీ తప్పకుండా ఆడియన్స్ కి నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు కళ్యాణ్ రామ్.

సంబంధిత సమాచారం :