మొదలైన లేడీ డైరెక్టర్ మూడో ప్రాజెక్ట్

Nandini-Reddy-Naga-shaurya
మన తెలుగు చిత్ర సీమలో లేడీ డైరెక్టర్స్ ఎంత మంది ఉన్నారు అంటే వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్పచ్చు. అలాంటి వారిలో యువతకు నచ్చే సినిమాలు చేస్తున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. ‘అలా మొదలైంది’తో సూపర్ హిట్ అందుకున్న నందిని రెడ్డి ఆ తర్వాత ‘జబర్దస్త్’తో హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న నందిని రెడ్డి ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించనుండగా, ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ఈ రోజు ఉదయం లాంచనంగా ప్రారంభమైంది. మే 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. షూటింగ్ మొదలు పెట్టాక ఆపకుండా కంటిన్యూ షూటింగ్ తో సినిమాని ఫినిష్ చెయ్యాలని ఈ చిత్ర టీం టైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. అలా మొదలిండి ఫేం దాము నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించనున్నాడు.

Exit mobile version