ఇంటర్వ్యూ : నందిత శ్వేత – ఈ సినిమాలో నాది టిఫికల్ క్యారెక్టర్.

నూతన దర్శకుడు హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ ప్రేమకథాచిత్రమ్ కు సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్ 2’. కాగా ఈ సందర్భంగా హీరోయిన్ నందిత శ్వేత మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’లో దెయ్యంగా బాగా భయం పెట్టారు. మరి ఈ సినిమాలో ఎలా భయపెట్టారు ?

‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’లో చేసిన క్యారెక్టర్ కంటే… ‘ప్రేమ కథా చిత్రమ్ 2’లో చేసిన దెయ్యం క్యారెక్టర్ వెరీ టిఫికల్ అండి.
‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ చేస్తున్నపుడు హర్రర్ కు సంబంధించి అంతగా నాకు అనిపించలేదు. కానీ నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు హర్రర్ ఎలిమెంట్స్ కు సంబధించి నాకు చాలా టిఫికల్ గా అనిపించింది.

మీరు ఎప్పుడైనా ‘దెయ్యం’ చూశాననుకుని భయపడిన సందర్భాలు ఉన్నాయా ?

ఒక పది సంవత్సరాల క్రితం అలాంటి సందర్భం నా లైఫ్ లో జరిగింది. నైట్ టెంపుల్ కి వెళ్తున్న సమయంలో ఏదో ఒక ఆకారం కనబడింది. చాలా భయం వేసింది. అప్పుడు అనిపించింది నిజంగా దెయ్యం ఉందేమోనని.. కానీ దేవుడు ఉన్నాడని కూడా నేను బాగా నమ్ముతాను.

‘ప్రేమ కథా చిత్రమ్’కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. మరి ‘ప్రేమ కథా చిత్రమ్’ చూశారా ?

చూసాను. కాకపాతే ఈ సినిమా ఒప్పుకున్న తరువాత మళ్లీ ఆ సినిమా చూడలేదు.

‘ప్రేమ కథా చిత్రమ్’కు ‘ప్రేమ కథా చిత్రమ్ 2’కి ముఖ్యంగా తేడా ఏమిటి ?

‘ప్రేమ కథా చిత్రమ్’ ఎండింగ్ నుంచి ఈ సినిమా మొదలవుతుంది. తేడా అంటే.. ఆ సినిమా 80 % కామెడీ, 20 % హర్రర్ ఉంటే.. ఈ సినిమాలో కామెడీ 50 – 50 ఉంటుంది. అలాగే నా క్యారెక్టర్ సంబంధించి యాక్టింగ్ లో మీరు పూర్తీ వేరియేషన్స్ చూడొచ్చు.

సుమంత్ ఆశ్వన్ తో నటించడం ఎలా అనిపించింది ?

నేను ఇంతకు ముందే సుమంత్ ఆశ్వన్ తో ఒక సినిమా చేశాను. ఈ సినిమాలో హర్రర్ కు సంబంధించిన సీన్స్ ను దాదాపు నలభై రోజులు పాటు నైట్ షూట్ చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు కో ఆర్టిస్ట్ ల నుండి మంచి సపోర్ట్ ఉండాలి. సుమంత్ ఆశ్వన్ మంచి కో ఆర్టిస్ట్ తో పాటు వెరీ నైస్ పర్సన్.. చాల బాగా సపోర్ట్ చేశాడు.

అసలు మీకు తెలుగు సినిమాల్లో మొదటి అవకాశం ఎలా వచ్చింది ? ఇప్పటివరకూ తెలుగులో ఎన్ని సినిమాలు చేశారు ?

నా మొదటి తెలుగు సినిమా ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా’. ఆ సినిమాలో నేను చేసిన అమల క్యారెక్టర్ నాకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పటివరకూ తెలుగులో ఏడు సినిమాలు చేశాను.

మీరు ఎందుకు గ్లామర్ రోల్స్ చెయ్యట్లేదు ?

అవకాశాలు వస్తే చెయ్యాలని నాకూ ఉంది. కానీ ఎవ్వరూ నాకు అలాంటి రోల్స్ ఆఫర్ చెయ్యట్లేదు. ఒకవేళ ఎవరైనా అలంటి రోల్స్ ఆఫర్ చేస్తే.. ఆ రోల్ కి సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా గ్లామర్ రోల్స్ చేస్తాను. రీసెంట్ గా ఓ తమిళ్ ఫిల్మ్ లో ఓ ఐటమ్ సాంగ్ లాంటి సాంగ్ కూడా చేశాను.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో కలిసి ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కూడా సెవెన్, అక్షర, ఇలా వరుస సినిమాలు ఉన్నాయి.

Exit mobile version