రాజ్ కిరణ్ దర్శకత్వంలో నందితరాజ్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. ఈ చిత్రాన్ని మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ నిర్మిస్తున్నారు. ఫణి తిరుమలశెట్టి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని షూటింగ్ స్పాట్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో.. నందిత మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. వైవిధ్యంగా అనిపించింది. స్ర్కిప్ట్ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు రాజ్‌కిరణ్ మాట్లాడుతూ ‘‘నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాను. కానీ పలువురు వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఆ తరుణంలో సంకల్పబలంతో నేను రాజకిరణ్ సినిమా అనే సంస్థను మొదలుపెట్టాను. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అందరూ సెట్ అయ్యారు. డిసెంబర్ మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. న్యూజిలాండ్‌లో జరిగిన యథార్థ గాథ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని అంశాలను కూడా మిళితం చేశాం. థ్రిల్లర్ తరహా చిత్రం. హారర్ కాదుగానీ, కొంచెం హారర్ టచ్ మాత్రం ఉంటుంది. కథ వినగానే నందిత యాక్సెప్ట్ చేశారు. అశుతోష్ రాణా ఇందులో మెయిన్ విలన్‌గా నటించారు’’ అని అన్నారు.
ఈ చిత్రానికి నటీనటులు : విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.యల్.నరసింహారావు, ఇందు ఆనంద్ కీలక పాత్రధారులు. కాగా ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు : ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్, ఆర్ట్: చిన్నా, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: రాజకిరణ్.
