నాని 29 వ సినిమా పై లేటెస్ట్ అప్డేట్!

Published on Oct 13, 2021 4:40 pm IST


న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక సినిమాను విడుదల కి సిద్దం చేస్తూనే మరొక సినిమాను సెట్స్ మీదకి తీసుకు వెళ్తున్నారు. నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ డ్రామా, లవ్ డ్రామా లతో పాటు పలు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా తన 29 వ సినిమా కి సంబందించిన దాని పై ఒక అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. తన 29 వ సినిమా ను అక్టోబర్ 15 వ తేదీన 1:53 గంటలకు ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను నాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

నాని 29 వ సినిమా కి సంబందించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి’ స్ వేంకటేశ్వర సినిమాస్ పతాకం పై నిర్మిస్తున్నారు. నాని రీసెంట్ మూవీ టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :