మెగా ప్రెజెన్స్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యిన “నాని 30”.!

Published on Jan 31, 2023 12:03 pm IST

లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా” కోసం తెలిసిందే. దీనిపై ఇప్పుడు హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లగా ఈ చిత్రం తర్వాత నాని హీరోగా చేస్తున్న తన బెంచ్ మార్క్ చిత్రం 30వ ప్రాజెక్ట్ అయితే సిద్ధం అవుతుంది. కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నాడు.

ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ చిత్రంగా ఇది ప్లాన్ చేస్తుండగా నాని కెరీర్ లో మరింత స్పెషల్ ప్రాజెక్ట్ గా అయితే ఇది నిలిచిపోనుంది. ఇక ఈ సినిమాని ఈరోజు మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం జరుపుకోగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం ఈవెంట్ కి హాజరయ్యి తన మెగా ప్రెజెన్స్ అయితే ఇచ్చారు.

మరి ఈ కార్యక్రమంలో మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొత్తగా విజయేంద్ర ప్రసాద్ దర్శకునికి స్క్రిప్ట్ ని అందించారు. మరి ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సహా ఇతర నటీనటులు కనిపించారు. ఇక ఈ చిత్రానికి హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ నాని ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :