“నాని 31” కి ఈ డైరెక్టర్ తోనే.?

Published on Feb 15, 2023 9:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా “దసరా”. దీనిపై భారీ అంచనాలు ఉండగా ఆల్రెడీ నాని తన కెరీర్ మైల్ స్టోన్ చిత్రం 30వ ప్రాజెక్ట్ ని కూడా కొత్త దర్శకునితో అయితే స్టార్ట్ చేసేసాడు. మరి ఈ సినిమాల పనుల్లో అయితే నాని ఫుల్ బిజీగా ఉండగా ఇప్పుడు నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ అయితే కొన్ని రోజులు నుంచి వైరల్ గా మారింది. దసరా కన్నా ముందు నాని హీరోగా చేసిన మరో బ్యూటిఫుల్ చిత్రం “అంటే సుందరానికీ” కోసం తెలిసిందే.

ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది కానీ అనుకున్న రేంజ్ బాక్సాఫీస్ హిట్ గా నిలవలేదు. కానీ ఆడియెన్స్ పరంగా మాత్రం మేకర్స్ సహా నాని కూడా ఈ సినిమా సక్సెస్ తో ఆనందంగా ఉన్నాడు. మరి ఈ డైరెక్టర్ తో అయితే నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఓకే చేసినట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :