బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటే నంబర్స్ కాదు హార్ట్స్ – నాని

Published on Jun 13, 2022 8:00 pm IST

నాని హీరోగా వివేక్ ఆత్రేయ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, ఈ చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా మలయాళ బ్యూటీ నజ్రియా నటించడం జరిగింది.

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వేడుక తాజాగా జరిగింది. ఈ వేడుక లో నాని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే సుందరానికి టీమ్ అందరికీ థాంక్స్. అందరం కలిసి ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ క్రియేట్ చేయగలిగినందుకు. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటే నంబర్స్ ను కాదు, హార్ట్స్ ను అంటూ నాని చెప్పుకొచ్చారు. మా సినిమాకి ఎంత ప్రేమ దక్కింది, చూసిన వాళ్ళకి ఎంత ఎంజాయ్ వచ్చింది అనే దానికి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని తెలిపారు. చాలా అరుదుగా వస్తాయి మంచి సినిమాలు. అందులో అంటే సుందరానికి ఒకటి అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా ట్రై చేసినప్పుడు ఒక మాస్ మూవీ తో కంపేర్ చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే ఇలాంటి కొత్త ఫ్లేవర్ సినిమాలు ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం అందరం భాగం అవుతాం అని అన్నారు. ఇది అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా అంటూ చెప్పుకొచ్చారు నాని. నాని చేసిన వ్యాఖ్యల తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :