రేపటి సంది దుమ్ము లేశిపోద్ది – హీరో నాని

రేపటి సంది దుమ్ము లేశిపోద్ది – హీరో నాని

Published on Oct 2, 2022 5:01 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్, నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 30 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రేపు ఫస్ట్ సింగిల్ అయిన ధూమ్ ధాం దొస్తాన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన ప్రోమో ను నేడు విడుదల చేయక పోవడం తో, హీరో నాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియో ను షేర్ చేశారు. డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ ప్రోమో ను రిలీజ్ చేయలేదు. షూటింగ్ సమయం లో తన ఫోన్ లో షూట్ చేసిన వీడియో ను తానే లీక్ చేశారు నాని. రేపటి సంది దుమ్ము లేశిపోద్ది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఊర నాటు గా ఉంది. మాస్ స్టెప్పులతో దుమ్ము లేచిపోయింది. ఫ్యాన్స్ ఫుల్ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు