శ్యామ్ సింగరాయ్ టీజర్ పై పెరుగుతున్న ఆసక్తి…సరికొత్త ఫోటో షేర్ చేసిన నాని!

శ్యామ్ సింగరాయ్ టీజర్ పై పెరుగుతున్న ఆసక్తి…సరికొత్త ఫోటో షేర్ చేసిన నాని!

Published on Nov 17, 2021 2:53 PM IST


నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది.

వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం తో సినిమా కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. రేపు ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ విడుదల కానుంది. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టీజర్ ఎలా ఉండనుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం టీజర్ రేపు విడుదల కానుండటం తో నాని ఒక సరికొత్త ఫోటో ను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది.

నాని కాలు మీద కాలు వేసుకొని, ఆగమని ఆజ్ఞాపిస్తూ ఉన్న ఫోటో సూపర్ గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 24 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు