ఆ రీమేక్ సినిమాలో నాని ?

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక తమిళ సినిమాపై మనసు పారేసుకుని ఆచిత్రం యొక్క రీమేక్ హక్కులను దక్కించుకున్నారని తెలిసిందే. అదే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటిస్తున్న’96’. ఈచిత్రం ఆయనకు బాగా నచ్చడంతో సుమారు కోటి రూపాయలకు వెంటనే రీమేక్ హక్కులను కొన్నారు. తాజాగా ఈచిత్రాన్ని నాని కు చూపెట్టారట దిల్ రాజు. అయితే నానికి కూడా ఈసినిమా నచ్చిందని సమాచారం. మరి ఈ సినిమాకు నాని ఒప్పుకుంటారో లేదో తెలియాల్సి వుంది. ఇక నాని నటించిన ‘దేవదాస్’ విడుదలకు సిద్ధంగా వుంది. ఈసినిమా తరువాత ఆయన ‘జెర్సీ’ చిత్రంలో నటించనున్నారు. మరి నాని ఈ 96 చిత్రాన్ని కూడా లైన్లో పెడతారో లేదో చూడాలి.

ఇక ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. 1996లో జరిగే ప్రేమ కథ నేపథ్యంలో తెరెక్కుతున్న ఈచిత్రం అక్టోబర్ 4న తమిళ ప్రేక్షకులముందుకు రానుంది. మద్రాస్ ఎంటర్ప్రైజస్ పతాకం ఫై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈచిత్రానికి గోవింద్ మీనన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version